తెలుగు యునైటెడ్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ప్రపంచ దయాగుణ దినోత్సవం
తెలుగు యునైటెడ్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర (TUAM) ఆధ్వర్యంలో నవంబర్ 13, 2026 న ప్రపంచ దయాగుణ దినోత్సవాన్ని (World Kindness Day) ఘనంగా నిర్వహిస్తున్నారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని అనుసంధానించడమే” ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంస్థ, ఈ ప్రత్యేక రోజు సందర్భంగా పలు స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రతి యేడాది నవంబర్ 13 న దయా దినోత్సవాన్ని తమ సంస్థ పక్షాన నిర్వహిస్తూనే వున్నామని సంస్థ ప్రకటించింది. ఆత్మవత్ సర్వ భూతేషు.. అందరిలో వున్న ఆత్మ ఒక్కటేనని, అందుకే ఎదుటి వారితో దయ, కరుణ, సానుభూతి, ఉదారతతో వ్యవహరించాలని సంఘం తెలిపింది. నలుగురికి సహాయం చేస్తూ, సమాజంలో సంతోషాన్ని పంచాలన్నదే తమ అభిమతమని కూడా తెలిపింది. చిన్న సహాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పేను తెస్తుందని సంఘం అధ్యక్షులు కాంటే అశోక్ ఓ ప్రకటన విడుదల చేశారు.
దయ అనేది అందరూ అర్థం చేసుకునే ఒకే ఒక భాష. చేసే చిన్న సహాయం కూడా ఎవరి రోజైనా పూర్తిగా మార్చివేయగలదు” అని పోస్టర్ ద్వారా నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, శ్రద్ధ, కరుణ మరియు దయాగుణాన్ని అన్ని చోట్లా విస్తరింపజేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు యునైటెడ్ అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర (TUAM) ఉచిత డిజిటల్ మెంబర్‌షిప్‌ను (FREE Digital Membership) అందిస్తోంది. ఆసక్తి గలవారు గూగుల్ ఫారమ్ (Google Form) లింక్ ద్వారా లేదా పోస్టర్లో ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ (QR Code)ను స్కాన్ చేసి సభ్యత్వం పొందవచ్చని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు (Founder President) కాంటే అశోక్ (Kante Ashok) తెలిపారు.మరిన్ని వివరాల కోసం 9920155702 నెంబరులో సంప్రదించవచ్చని సూచించారు.







