నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైదరాబాద్లోని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఆయనపై నమోదైన పలు పాత కేసుల విచారణ ప్రక్రియలో భాగంగా సీఎం స్వయంగా న్యాయస్థానానికి వచ్చి స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. 2021లో జరిగిన నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచార సమయంలో కోవిడ్ (COVID) నిబంధనలు పాటించలేదనే ఆరోపణలపై రేవంత్ రెడ్డిపై ఈ కేసు నమోదైంది.
అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడి (TPCC President)గా ఉన్న ఆయన, 2021 ఏప్రిల్ 11న నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తిలో నిర్వహించిన ప్రచారంలో మాస్క్ ధరించలేదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) సెక్షన్ 313 కింద న్యాయమూర్తి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.







