అందోల్‌లో ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ..
అందోల్ మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహితులను అభినందిస్తూ డాన్ బాస్కో పాఠశాలలో గౌరవ ఎంఈవో (MEO) గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ ఎస్. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), తహసీల్దార్ (MRO) మధుకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, జిల్లా పీఆర్టీయూ (PRTU) అధ్యక్షులు ఆకుల మాణయ్య, వార్డు సభ్యులు ఊర్మిళ దుర్గేష్, డాన్ బాస్కో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ , ఉపాధ్యాయులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.







