రెడ్ గౌన్‌లో కియారా అద్వానీ గ్లామర్ ట్రీట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(kiara advani) మరోసారి తల్లి కాబోతున్నప్పటికీ తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రెగ్నెన్సీ లోనూ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదంటూ అదిరిపోయే రెడ్ గౌన్‌లో మెరిశారు. కియారా ధరించిన ఈ రెడ్ కలర్ గౌన్ ఎంతో ప్రత్యేకంగా ఉంది. స్లీవ్‌లెస్ డిజైన్, హై నెక్లైన్, ఫ్రంట్ డ్రేపింగ్‌తో ఈ డ్రెస్‌కు క్లాసీ లుక్ వచ్చింది. నడుము దగ్గర మెరిసిపోతున్న స్టార్ ఫిష్ స్టోన్ స్పెషలి ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ గౌన్‌లో ఉన్న థై హై స్లిట్ కియారా లుక్కు మరింత గ్లామర్‌ను తీసుకొచ్చింది. తన డ్రెస్సింగ్ కు తగ్గట్టుగా డైమండ్ స్టడ్ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, స్టేట్మెంట్ రింగ్స్ ఆమె అందానికి మరింత మెరుపునివ్వగా ఆమె రెడ్ గౌన్ లుక్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.







