దీపక్ నైట్రైట్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు దీపక్ నైట్రైట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ మెహతా (Deepak Mehta), డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మౌలిక్ మెహతా (Maulik Mehta)లతో సీఎం సమావేశం అయ్యారు. ఎపిలో కెమికల్ పార్క్ (Chemical Park) ఏర్పాటులో భాగస్వాములు కావాలని వారిని సీఎం చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా మానవ వనరులు, స్కిల్ డెవల్మెంట్ అంశాలను సీఎం చంద్రబాబు వివరించారు.







