ఏపీకి దిగ్గజ సంస్థల పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు
విశాఖపట్నం, 12 నవంబర్ 2026
శ్రీకాకుళం జిల్లా మూలపేటలో 1.27 MMTPA గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్ కోసం 13,500 కోట్ల చారిత్రాత్మక ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, విశాఖపట్నంలో జరిగిన 31వ CII పార్టనర్షిప్ సమ్మిట్ 2026 లో గెయిల్ (ఇండియా) లిమిటెడ్, కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్కో) మరియు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (APEDB) మధ్య కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసిన వారు:
– శ్రీ సగిలి షణ్ మోహన్ (IAS) – CEO, APEDB
– శ్రీ సంజయ్ అగర్వాల్ – ED (బిజినెస్ డెవలప్మెంట్, స్టార్టప్ & R&D), GAIL
– శ్రీ సి.ఎస్. ఆజాద్ – ED (టెక్నికల్), KRIBHCO
వీరి సమక్షంలో:
– శ్రీ వల్లభనేని సుధాకర్ చౌదరి గారు – డైరెక్టర్, APEDB & చైర్మన్, KRIBHCO
– శ్రీ ఎస్.ఎస్. యాదవ్ – మేనేజింగ్ డైరెక్టర్, KRIBHCO
– శ్రీ ఆర్.కె. సింఘాల్ – డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్), GAIL (ఇండియా) లిమిటెడ్
ముఖ్యాంశాలు:
– ప్రాజెక్ట్: గ్యాస్ ఆధారిత యూరియా తయారీ ప్లాంట్
– సామర్థ్యం: సంవత్సరానికి 1.27 మిలియన్ మెట్రిక్ టన్నులు (MMTPA)
– ప్రదేశం: మూలపేట, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
– గ్యాస్ సరఫరా: GAIL శ్రీకాకుళం-అంగుల్ పైప్‌లైన్ (SAPL) ద్వారా
ఈ ప్రాజెక్ట్ భారతదేశ ఎరువుల స్వయం సమృద్ధి దిశగా ఒక పెద్ద ముందడుగు. దేశీయ యూరియా ఉత్పత్తిని బలోపేతం చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ను పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలుపుతుంది.







