సెయింట్ లూయిస్ మరాఠీ మండల్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
సెయింట్ లూయిస్ మరాఠీ మండల్ (STLMM) వారు అత్యంత వైభవంగా ‘దీపావళి వేడుకలు 2026’నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకలకు అందరూ కుటుంబ సమేతంగా రావాలని పిలుపునిస్తున్నారు. నవంబర్ 15 న తేదీన జరిగే ఈ సంబరాలు మహాత్మా గాంధీ సెంటర్, 727 వీడ్మాన్ రోడ్, మంచెస్టర్, MO 63011.వేదికగా జరగనున్నాయి.
అయితే.. నవంబర్ 15 న మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల వరకూ ఈ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు జరుగుతాయి. ఇందులో ఆసక్తి వున్న వారు పాల్గొనవచ్చని సూచించారు. నృత్యాలు, పాటల పోటీలు, సంగీత వాయిద్య ప్రదర్శనలు వుంచుతున్నామని నిర్వాహకులు తెలిపారు.
మరో వైపు STLMM సభ్యులకు మాత్రం ఇందులో పాల్గొనడానికి ఎలాంటి రుసుము వుండదని, పూర్తిగా ఉచితమని తెలిపారు. సభ్యులు కాని వారికి ఒక్కొక్కరికి 20 డాలర్లు, పిల్లలకు 15 డాలర్లుగా నిర్ణయించామని ప్రకటించారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 15
సమయం : మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు
వేదిక : మహాత్మా గాంధీ సెంటర్, 727 వీడ్మాన్ రోడ్, మంచెస్టర్, MO 63011.







