శివ- విష్ణు టెంపుల్ లివ్ మోర్ ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమైన స్కంద షష్ఠి ఉత్సవాలు
శివ- విష్ణు టెంపుల్ లివ్ మోర్ ఆధ్వర్యంలో స్కంద షష్ఠి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 9 నుంచి 15 వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు సాయంత్రం 5:00 గంటల నుంచి షణ్ముఖునికి పూర్ణాభిషేకం, విభూతి అలంకారం, అర్చన, తీర్థ ప్రసాద వితరణతో ప్రారంభమయ్యాయి.
అదే విధంగా నవంబర్ 10 వ తేదీన సుబ్రహ్మణ్యునికి పూర్ణ అభిషేకం, చందన అలంకారం, అర్చన, తీర్థ ప్రసాద వితరణ జరిగింది.
మూడో రోజు అంటే నవంబర్ 11 న సాయంత్రం 5:00 గంటలకు పూర్ణ అభిషేకం. పచ్చచార్తి అలంకారం, అర్చన, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి.
ఇక.. నాలుగో రోజు అంటే 12 వ తేదీన సాయంత్రం సుబ్రహ్మణ్యునికి పూర్ణ అభిషేకం, హరిద్రా అలంకారం, అర్చన, తీర్థ ప్రసాద వితరణతో ముగిసింది.
ఐదో రోజున అంటే నవంబర్ 13 న సాయంత్రం పూర్ణ అభిషేకం, రుద్రాక్షమాల అలంకారం, అర్చన, తీర్థ ప్రసాద వితరణతో ముగిసింది.
ఆరో రోజున అంటే.. నవంబర్ 14 న ఉదయం 9:30 గంటలకు కావడి పూజ, పాల్కుడం తిరువీధి ఉత్సవం, మురుగన్ పూర్నాభిషేకం, సుబ్రహ్మణ్య సహస్రనామ, గాయత్రీ హోమం, పూలంగి సేవ, అర్చన, తీర్థ ప్రసాద వితరణ వుంటుంది. ఇక సాయంత్రం 5 గంటలకు సూర పద్మన్ వదమ్ వుంటుంది.
నవంబర్ 15 న ఉదయం 8:30 గంటలకు సుబ్రహ్మణ్య అభిషేకం, స్వర్ణ అలంకారం, అర్చన, తీర్థ ప్రసాద వితరణ వుంటుంది. అలాగే వల్లీ దేవసేన, సుబ్రహ్మణ్య కల్యాణోత్సవం వుంటుంది. చివరగా తీర్థ ప్రసాద వితరణ వుంటుంది.
ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకుంటే ఇలా వుంటుంది.
ఏ అర్చన అయినా… 12 డాలర్లు
కావడి పూజ.. 21 డాలర్లు
అభిషేకం, కల్యాణోత్సవం 51 డాలర్లు
పూల సమర్పణ (స్కంద షష్ఠి రోజున), అన్నదానం అయితే 251 డాలర్లు
వస్త్ర సమర్పణ 221 డాలర్లు
అన్ని రోజుల పాటు అభిషేకం అలాగే యేడాది పాటు నెలకోసారి అభిషేకం 301` డాలర్లు
యేడాది పాటు స్కంద షష్ఠి రోజున అభిషేకం అయితే 501 డాలర్లు
గ్రాండ్ స్పాన్సర్ (ఆరు రోజుల అభిషేకం, కల్యాణోత్సవం) 116 డాలర్లు
సిల్వర్ స్పాన్సర్ – 5,001 డాలర్లు
గోల్డ్ స్పాన్సర్ – 10,001 డాలర్లు
అలాగే భక్తులు 2025 అక్టోబర్ 21వ తేదీ మంగళవారం నుండి అక్టోబర్ 27వ తేదీ సోమవారం వరకు, శ్రీ కార్తికేయ స్వామి వారికి ‘వస్త్ర సమర్పణ’ చేసే అవకాశం కలిగి ఉంటారు. ఈ సమర్పణ కోసం అవసరమైన వస్త్రాలను (పట్టు ధోవతి) ఆలయ కార్యాలయం నుండే అందించడం జరుగుతుంది. పరిమిత సంఖ్యలో మాత్రమే అవకాశాలు ఉన్నందున, వీలైనంత త్వరగా ఆలయ కార్యాలయానికి ఫోన్ చేసి మీ వస్త్ర సమర్పణను నమోదు చేసుకోగలరు. కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత, వస్త్ర సమర్పణ చేసిన భక్తులు ఆ వస్త్రాలను తిరిగి తీసుకోవచ్చని దేవస్థానం సూచించింది.
కావడి పూజ: పరిమిత సంఖ్యలో మాత్రమే కావడిలు అందుబాటులో ఉన్నాయి; వీటిని ముందుగా నమోదు చేసుకున్న భక్తులకు కేటాయిస్తాము. మీరు పాలకుడంతో పాటు కావడిని మోయాలనుకుంటే, దయచేసి ఈ కార్యక్రమ సమన్వయకర్తకు (Event Coordinator) తెలియజేయండి మరియు నిర్ణీత సమయానికి హాజరు కావండి. ఒకవేళ స్పాన్సర్ (కావడిని సమర్పించే వ్యక్తి) సమయానికి అందుబాటులో లేకపోతే, ఆ కావడిని జాబితాలో తదుపరి ఉన్న వ్యక్తికి కేటాయిస్తామని దేవస్థానం ప్రకటించింది.







