డల్లాస్ లోని రాధాకృష్ణ ఆలయంలో నాలుగు రోజుల పాటు వైభవంగా దీపావళి వేడుకలు
JKYog USA ప్రధాన కార్యాలయమైన డల్లాస్ (అలెన్)లోని రాధా కృష్ణ దేవాలయంలో నవంబర్ 5 నుంచి 9 వ తేదీ వరకు దీపావళి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవానికి డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు, సందర్శకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంగీతం, సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్సాహభరితంగా సామూహిక ఉత్సవాలు కూడా జరిగాయి. అదే విధంగా అందరూ కలిసి బాణాసంచా పేల్చి, దీపావళి జరుపుకున్నారు.
ఈ వేడుకల ద్వారా భారతీయ సంప్రదాయం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం అందరికీ మరోసారి పరిచయం అయినట్లు అయ్యింది. ఈ ఉత్సవానికి అలెన్ మేయర్ క్రిస్ ఎ. షుల్మీస్టర్ ఇతర నగర అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి యొక్క అందమైన సంప్రదాయాలను మరియు సాంస్కృతిక అవగాహన, సమాజ ఐక్యతను ప్రోత్సహించడంలో రాధా కృష్ణ ఆలయం చేసిన కృషిని గుర్తిస్తూ, అలెన్ నగరం అధికారికంగా నవంబర్ 5-7, 2026 తేదీలను Diwali-Festival of Lights Week”,గా ప్రకటించారు.
ఈ సందర్భంగా బాణాసంచా కాల్చడంతో పాటు భజన్ క్లబ్బింగ్ కచేరీ కూడా అందర్నీ విశేషంగా ఆకర్షించింది. ఇందులో భక్తులు శ్రీరాముడు, సీత మరియు హనుమంతునికి అంకితం చేయబడిన భక్తి భజనలకు ఉత్సాహంగా పాడారు, నృత్యం చేశారు. ఈ ఉత్సాహభరితమైన సంగీత వేడుక అన్ని తరాల ప్రజలను ఆధ్యాత్మిక ఆనంద వాతావరణం ఉట్టిపడింది. అదే విధంగా ‘‘రామలీల’’ నాటక ప్రదర్శన కూడా చేశారు. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీరాముని పవిత్రమైన కథను విని, తమకెంతో ఉత్సాహం నింపిందని ప్రేక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ వైభవోపేత వేడుకలోని మరో ఆకర్షణ, “గోవర్ధన అన్నకూట్ పూజ మరియు గుజరాతీ నూతన సంవత్సరం” కూడా దీపావళి ఉత్సవాలకు భక్తి, ఆధ్యాత్మికతల ప్రత్యేక స్పర్శను జోడించింది. బ్రజ వాసులను రక్షించడానికి శ్రీకృష్ణుడు తన చిటికెనవేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతున్న దృశ్యాన్ని అందంగా చిత్రిస్తూ, ఆలయంలో ఒక అద్భుతమైన గోవర్ధన జానకిని (అలంకార ప్రదర్శన) ఏర్పాటు చేశారు.







