‘‘సోమిరెడ్డి లా గ్రూప్’’ కార్యాలయాన్ని సందర్శించిన ఎన్నారైలు
హైదరాబాద్ కోకాపేటలో వున్న ‘‘సోమిరెడ్డి లా గ్రూప్’’ కార్యాలయాన్ని నవంబర్ 12 న ప్రముఖ ప్రవాస భారతీయులు సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ సంతోష్ సోమిరెడ్డి వారందరికీ ఘనంగా, సాదరంగా స్వాగతం పలికారు. అలాగే తమ సంస్థను సందర్శించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు.

ఈ సందర్భంగా సంతోష్ సోమిరెడ్డి ఈ ప్రముఖులందరికీ తమ సంస్థ ఘనమైన ప్రస్థానాన్ని వివరించారు. కేవలం భారత్ లోనే కాకుండా వర్జీనియా, మేరీల్యాండ్, టెక్సాస్ లో కూడా తమ సంస్థ కార్యాలయాలు వున్నాయని వివరించారు. అయితే.. 2017 లోనే వర్జీనియా కేంద్రంగా తమ సంస్థ ప్రారంభమైందని, అప్పటి నుంచి నిరాటంకంగా ప్రజలకు సేవలు అందిస్తూనే వుందని తెలిపారు. 2025 జూన్ మాసంలో హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. అలాగే 2026 సెప్టెంబరులో టెక్సాస్ లోని డల్లాస్ కార్యాలయాన్ని ప్రారంభించామని వారికి వివరించారు. తమ సంస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని, మరింత మెరుగైన సేవలు అందించడానికి నిరంతరాయంగా కృషి చేస్తూనే వున్నామని తెలిపారు.

అతి త్వరలోనే అమెరికాలోని మరిన్ని నగరాలకు కూడా తమ సంస్థ సేవలను వివరిస్తామని, అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని వారి దృష్టికి తీసుకొచ్చారు. ఇక.. తమ సంస్థ అందిస్తున్న న్యాయ సేవల గురించి కూడా వారికి వివరించారు. ప్రస్తుతం సోమిరెడ్డి లా గ్రూప్‌లో 150 మందికి పైగా పూర్తిస్థాయి ఉద్యోగులు పనిచేస్తున్నారని, అమెరికాలో 12 మంది నిపుణులైన అటార్నీలు అందుబాటులో ఉన్నారని సంతోష్ వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ (Immigration), కార్పొరేట్, క్రిమినల్, మేధో సంపత్తి హక్కులు (Intellectual Property), పన్నుల విధానం (Taxation), మరియు కుటుంబ వ్యవహారాలు (Family Law) తదితర విభాగాల్లో తమ క్లయింట్లకు అత్యుత్తమ న్యాయ సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం న్యాయ విభాగం మరింత విస్తరిస్తోందని, అందుకు తగ్గ ఏర్పాట్లు, నిపుణులను నియమించే పనిలో కూడా వున్నామని సంతోష్ సోమిరెడ్డి ప్రతినిధులకు వివరించారు. రోజు రోజుకీ న్యాయ విభాగం విస్తరిస్తోందని, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు.

మరోవైపు సంతోష్ సోమిరెడ్డి చేస్తున్న కృషిని ప్రవాస భారతీయులకు అందిస్తున్న సహాయ సహకారాలను ఈ సందర్భంగా అందరూ మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే వారు చేస్తున్న సేవలను చూసి మంత్ర ముగ్ధులయ్యారు. మరోవైపు సోమిరెడ్డి లా గ్రూప్ ను సందర్శించిన వారిలో ప్రదీప్ మాగంటి, సిరి సంపద గ్రూప్‌కు చెందిన రాజ్ మాగంటి, వినయ్ పరుచూరి (కాలిఫోర్నియా), జగదీష్ అనుముల, రవి పొట్లూరి, వేణు కోమటిరెడ్డి (ఫిలడెల్ఫియా), ప్రవీణ్ అండపల్లి (న్యూజెర్సీ), కిరణ్ పాశం (అట్లాంటా), నితిన్ బీడి (హ్యూస్టన్), తెలుగు టైమ్స్ (USA) అధినేత సుబ్బారావు చెన్నూరి, సురేష్ మనుకొండ (డల్లాస్), వెంకట్ అన్నపురెడ్డి, అప్పిరెడ్డి, ఫార్మాక్ రామ్ (Formac Ram), మరియు సందీప్ సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.







