సంప్రదాయ అందంలో మెరిసిన నిహారిక కొణిదెల!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి, నిర్మాత నిహారిక కొణిదెల(Niharika Kondiela) మరోసారి సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. రెడ్ కలర్ పట్టు శారీకు కాంట్రాస్ట్‌గా పర్పుల్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ధరించి, అందమైన నగలు, గాజులతో తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టారు.
చీరకట్టులో ఆమె అందం, చిరునవ్వు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ ఫొటోషూట్‌లో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎంతో సహజంగా, హుందాగా కనిపించారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, హెయిర్ స్టైల్ ట్రెడిషనల్ లుక్కు మరింత వన్నె తీసుకొచ్చాయి. అటు క్లోజప్ షాట్స్‌లో తన అందమైన చిరునవ్వుతో ఆకట్టుకోగా, ఇటు ఫుల్ లెంగ్త్ ఫొటోల్లో చీరకట్టులోని ప్రత్యేకతను చాటుకున్నారు.







