సమర్థ నాయకత్వంలో అద్భుతాలు సృష్టించవచ్చు : సీఎం చంద్రబాబు
సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజున ఫైర్ సైడ్ చాట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మ చేపట్టిన ఫైర్ సైడ్ చాట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
• ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలను వివరించిన ముఖ్యమంత్రి.
• భవిష్యత్ ఐటీకి ఉంటుందని ఆనాడే అంచనా వేసి ఆ రంగానికి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపిన సీఎం చంద్రబాబు.
• హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించేలా మైక్రో సాఫ్ట్ సంస్థ స్థాపకులు బిల్ గేట్స్‌ను తాను ఒప్పించిన విధానాన్ని చెప్పిన ముఖ్యమంత్రి.
• భారత దేశంలో మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ప్రావీణ్యత సాధించిన విద్యార్థులు ఉంటారని… ఇది ఐటీ రంగానికి ఉపయోగపడుతుందని నాడు బిల్ గేట్స్‌కు వివరించానన్న సీఎం చంద్రబాబు.
• ఐటీ రంగానికి అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంజనీరింగ్ కాలేజీలకు ఎక్కువగా అనుమతులిచ్చామని చెప్పిన ముఖ్యమంత్రి.
• ఐటీకి తాను ప్రాధాన్యతనిస్తుంటే నాటి ప్రతిపక్షాలు విమర్శించేవని తెలిపిన సీఎం చంద్రబాబు.
• ఐటీ సంస్కరణలే కాకుండా… దేశంలోనే తొలిసారి విద్యుత్ సంస్కరణలను కూడా తెచ్చానన్న ముఖ్యమంత్రి.
సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏఐ, డెమోగ్రాఫిక్ డివిడెండ్ వంటి అంశాలను ఫైర్ సైడ్ చాట్‌లో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.
• ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్ల కలిగే లాభాలను వివరించిన ముఖ్యమంత్రి.
• వివిధ దేశాల్లో భవిష్యత్తులో యువకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని నివేదికలు వస్తున్నాయన్న సీఎం చంద్రబాబు.
• మన దేశానికి యువత అత్యంత బలమైన మానవ వనరులని… జనాభానే భారతదేశానికి సంపద అని చెప్పిన సీఎం చంద్రబాబు.
• ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
• ఏఐ, క్వాంటం వంటి రంగాలతో పాటు… సేవల రంగంలో ముఖ్యంగా టూరిజం రంగంలో ఎక్కువ ఉపాధి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపిన చంద్రబాబు.
• టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోందన్న సీఎం చంద్రబాబు.
• అమెరికా, యూరప్ వంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా రూపాంతరం చెందడానికి చాలా కాలం పట్టిందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.
• అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడం… భవిష్యత్ రంగాలను అంచనా వేసుకుని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని యువతకు సీఎం చంద్రబాబు సూచనలు.
• పీ3 విధానంలో మౌళిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని… ఇదే సమయంలో కొందరు అద్భుతమైన ప్రగతి సాధించారని చెప్పిన ముఖ్యమంత్రి.
• పేదలకు-ధనవంతులకు మధ్యనున్న అంతరాలను తగ్గించేందుకు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపిన సీఎం చంద్రబాబు.
• ప్రతి కార్పోరేట్ యాజమాన్యంలోనూ పేదలను ఆదుకోవాలి.. వారికి చేయూతనివ్వాలనే ఆలోచన కలగాలన్న ముఖ్యమంత్రి.
• కార్పోరేట్ సంస్థలు పేదలకు చేయూతనివ్వకుంటే.. అంతరాలు పెరిగితే పేద, మధ్య తరగతి ప్రజల్లో నిరాశా నిస్పృహలు పెరుగుతాయని.. ఇవి అంతిమంగా ఆందోళనలకు దారి తీస్తాయని… ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ తరహా వాతావరణం చూస్తున్నామన్న ముఖ్యమంత్రి.
• పేదలను ఆదుకునేందుకు ధనవంతులు… కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు సూచన.
• రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి భరోసా, భద్రత కలిగించేలా పని చేస్తున్నామని వివరించిన సీఎం చంద్రబాబు.
• సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ది పొందుతున్నారన్న ముఖ్యమంత్రి
• ఇలా చేస్తున్నాం కాబట్టే… ఓపీ జిందాల్ యూనివర్శిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో ఏపీ 13వ స్థానంలో ఉన్నా… జీవన ప్రమాణాల విషయంలో రెండో స్థానంలో ఉందని చెప్పిన సీఎం చంద్రబాబు.







