రోజూ బయటకు వెళ్తున్నారా? మీ ముఖం అందం దెబ్బతినకుండా ఈ 6 జాగ్రత్తలు తీసుకోండి!
ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దగ్గరి నుంచి తిరిగి వచ్చే వరకు మన చర్మం ఎన్నో రకాల కాలుష్యానికి గురవుతుంది. వాహనాల పొగ, దుమ్ము, సూక్ష్మ ధూళి కణాలు, ఎండ, రసాయనాల ప్రభావం చర్మంపై పడుతుంది. దీనివల్ల ముఖం నిస్తేజంగా మారడం, మొటిమలు రావడం, చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా రోజూ బయటకు వెళ్లి పనిచేసేవారు చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు ఉపయోగించకుండానే కొన్ని చిన్న అలవాట్లతో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం!
ముందుగా ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం మీ చర్మ తత్వానికి సరిపోయే మృదువైన ఫేస్ వాష్ (Face Wash) ఉపయోగించవచ్చు. బయటకు వెళ్లినప్పుడు చర్మంపై పేరుకుపోయే దుమ్ము, అదనపు జిడ్డును తొలగించడానికి ఇది సహాయపడుతుంది. అయితే రోజులో పదేపదే ముఖాన్ని కడగడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైనంత వరకే శుభ్రం చేసుకోవాలి.
చర్మ తేమ కోసం మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్!
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో మాయిశ్చరైజర్ (Moisturizer) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖం కడిగిన తర్వాత చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మంలోని తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు తేలికపాటి, రంధ్రాలను మూసివేయని ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది.
బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ (Sunscreen) తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎండలోని అతినీలలోహిత కిరణాల (UV Rays) ప్రభావం వల్ల చర్మం త్వరగా వృద్ధాప్య ఛాయలను సంతరించుకోవచ్చు. అందుకే కనీసం ఎస్పీఎఫ్ 30 ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగించడం మంచిది. బయట ఎక్కువసేపు ఉన్నప్పుడు ప్రతి రెండు గంటలకు ఒకసారి మళ్లీ రాసుకోవాలి. టోపీ, గొడుగు, సన్ గ్లాసెస్ ఉపయోగించడం కూడా చర్మ రక్షణకు తోడ్పడుతుంది.
ఇవి కూడా చదవండి
ఇంటికి వచ్చాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి!
ఇక సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. రోజంతా చర్మంపై పేరుకున్న దుమ్ము, చెమట, సన్‌స్క్రీన్ అవశేషాలను తొలగించాలి. మేకప్ వేసుకునేవారు ముందుగా దాన్ని సరిగ్గా తొలగించి, తర్వాత ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవాలి. రాత్రి నిద్రపోయే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది.
చర్మ ఆరోగ్యానికి ఈ అలవాట్లు కూడా అవసరం!
అలాగే రోజూ తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటి పోషకాహారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి (Vitamin C), యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన చర్మానికి తోడ్పడతాయి. తగినంత నిద్ర కూడా అవసరం.
ముఖ్యంగా ఒకేసారి ఎక్కువ బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించడం, తరచూ స్క్రబ్బింగ్ చేయడం, ముఖంపై గట్టిగా రుద్దడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. కొత్త ఉత్పత్తులను ఉపయోగించే ముందు చిన్న ప్రాంతంలో పరీక్షించుకోవడం మంచిది. చర్మంపై దురద, మంట, దద్దుర్లు లేదా మొటిమలు ఎక్కువగా ఉంటే చర్మ వైద్యులను సంప్రదించాలి.







