ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) ఫ్రిస్కో దివాళీ మేలా 2026 గ్రాండ్ గా జరిగింది. DFW గుజరాతీ సమాజ్, ఇంక్ సంస్థలు హోస్ట్ గా వున్నాయి. ఫ్రిస్కోలోని కాలిడోస్కోప్ పార్క్ లో జరిగిన ఈ అద్భుతమైన వేడుకకి భారతీయులు అధిక సంఖ్యలో హాజరై, ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. ఈ అద్భుతమైన కార్యక్రమం మన గొప్ప భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత మరియు దీపావళి స్ఫూర్తిని జరుపుకోవడానికి వేలాది మంది సమాజ సభ్యులను ఒకచోట చేర్చింది. దీని ద్వారా యావత్ ప్రపంచానికి భారతీయ పర్వదినాల గొప్పదనం మరోసారి చాటినట్లయ్యింది.

ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఇందుకు తగ్గట్టుగానే నిర్వాహకులు అన్ని రకాల సౌకర్యాలను, వసతులను కల్పించి, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేశారు.
మరో వైపు ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలా చేసిన DFWGS నాయకత్వానికి, నిర్వాహక కమిటీకి, అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లకు, స్పాన్సర్లకు, కొరియోగ్రాఫర్లకు, ప్రదర్శకులకు మరియు తెర వెనుక అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అయితే.. ఇది కేవలం దీపావళి పండగ మాత్రమే కాదని, సమాజం ఎంత ఐక్యంగా వుంది, సంఘటిత శక్తి ప్రదర్శనలాగా కూడా జరుపుకున్నామని నిర్వాహకులు పేర్కొన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు.







