మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో మరింత విస్తరించిన లైట్‌హౌస్ లెర్నింగ్
ముంబై భారతదేశంలోనే అగ్రగామి ఎర్లీ చైల్డ్‌హుడ్ , కే-12 విద్యా సంస్థ అయిన లైట్‌హౌస్ లెర్నిం(Lighthouse Learning) గ్.. హైదరాబాద్‌లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ పార్ట్నర్షిప్ ద్వారా మేరు సంస్థకు చెందిన విచారణ ఆధారిత విద్యా విధానం, లైట్‌హౌస్ లెర్నింగ్ సంస్థకు ఉన్న అకడమిక్ నైపుణ్యం, జాతీయ స్థాయి నెట్వర్క్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ సామర్థ్యాలు ఒక్కచోట చేరనున్నాయి. తద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు లభించడమే కాకుండా, పాఠశాల తదుపరి దశ అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ప్రకటించారు. మేఘన గోరుకంటి జూపల్లి ఆధ్వర్యంలో 2018లో స్థాపించబడిన మేరు ఇంటర్నేషనల్ స్కూల్ అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. విద్యార్థుల్లో జిజ్ఞాసను, స్వతంత్ర ఆలోచనా శక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ మియాపూర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో క్యాంపస్‌లను నిర్వహిస్తూ, గోపన్‌పల్లిలో మరో కొత్త అత్యాధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ తాజా ఒప్పందంతో మేరు పాఠశాలకు లైట్‌హౌస్ లెర్నింగ్ సంస్థకు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం, పటిష్టమైన భద్రతా ప్రమాణాలు, విద్యార్థుల మానసిక ఉల్లాసాన్ని పెంచే సెంటర్ ఆఫ్ వెల్-బీయింగ్, సురక్షితమైన సాంకేతిక సేవలు అందించే డిజిటల్ ల్యాబ్స్ వంటి సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులను జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తూ నాయకత్వ లక్షణాలను మెరుగుపరచడం ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం.
ఈ భాగస్వామ్యం గురించి లైట్‌హౌస్ లెర్నింగ్ ఫౌండర్, గ్రూప్ (Lighthouse Learning Group) సీఈఓ ప్రజోద్ రాజన్(Prajodh Rajan) మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే మేరు స్కూల్ మంచి పేరు తెచ్చుకుందని, పిల్లలు ప్రశ్నలు అడగడాన్ని ప్రోత్సహించే వారి అభ్యాస విధానం తమకు ఎంతో నచ్చిందని చెప్పారు. ప్రతి పిల్లవాడిలోని ప్రతిభను బయటకు తీయాలనే తమ ఆలోచనలకు ఇది సరిపోతుందని, తమ అకాడమిక్ నైపుణ్యాలు, భద్రతా వ్యవస్థలు, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలతో మేరును మరింత బలోపేతం చేసి స్వాగతిస్తున్నామని తెలిపారు. మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ డైరెక్టర్ మేఘన గోరుకంటి జూపల్లి మాట్లాడుతూ.. పిల్లలకు ఎలా ఆలోచించాలో నేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ పాఠశాలను ప్రారంభించామని, తమ ప్రయాణంలో తదుపరి దశకు చేరుకునేందుకు తమ ఆలోచనలను పంచుకునే సరైన భాగస్వామి దొరికారని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మరింత మెరుగైన అవకాశాలు సృష్టిస్తామన్నారు. ఈ భాగస్వామ్యానికి లోఎస్ట్రో అడ్వైజర్స్ (LoEstro Advisors) ఎక్స్‌క్లూజివ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా వ్యవహరించింది. లైట్‌హౌస్ లెర్నింగ్ గ్రూప్‌కు సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ (Cyril Amarchand Mangaldas) లీగల్ అడ్వైజర్‌గా, మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌కు క్విల్లాన్ పార్ట్నర్స్ (Quillon Partners) లీగల్ అడ్వైజర్‌గా సేవలందించగా.. గ్రూప్‌నకు ఎర్నెస్ట్ అండ్ & ఎల్ఎల్పీ(Ernst & Young LLP) ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా వ్యవహరించింది.







