వొడాఫోన్ ఐడియా యూజర్లకు బంపరాఫర్… రూ.35కే రీజినల్ ఓటీటీలు
భారతీయ ఓటీటీ రంగంలో ప్రాంతీయ భాషా కంటెంట్‌కు ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో.. వీఐ (Vi)కి చెందిన కంటెంట్ అగ్రిగేటర్ యాప్ ‘వీఐ(Vi) మూవీస్ అండ్ టీవీ’ కేవలం రూ.35కే భారతదేశంలో అత్యంత సరసమైన ‘రీజినల్ ఎంటర్టైన్మెంట్ యాడ్-ఆన్ ప్యాక్’ను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త ఆఫర్ ద్వారా అర్హత గల వీఐ (Vi) ప్రీపెయిడ్ కస్టమర్లు తొమ్మిది భారతీయ భాషలకు చెందిన ఆరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తమకు నచ్చిన ఏవైనా రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవచ్చు. దీనివల్ల అందరికీ ప్రీమియం ప్రాంతీయ ఓటీటీ వినోదం సులభంగా అందుబాటులోకి వస్తుంది.
కస్టమర్లు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ కంటెంట్ కోసం సోనీలివ్ సౌత్(SonyLIV South); పంజాబీ, హర్యాన్వి మరియు భోజ్‌పురి కంటెంట్ అందించే చౌపాల్ (Chaupal); మలయాళ వినోదం కోసం మనోరమ మాక్స్ (ManoramaMAX); బెంగాలీ వినోదం కోసం క్లిక్ (KLiKK), అడాటైమ్స్ (AddaTimes); ఒరియా కంటెంట్ కోసం ఆవో నెక్స్ట్ (Aao NXT) వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రైబ్ చేసుకోకుండానే, తమకు నచ్చిన ప్రాంతీయ వినోదాన్ని అతి తక్కువ ధరలో ఆస్వాదించవచ్చు.
కేవలం 35 రూపాయల మొబైల్-ఓన్లీ యాడ్-ఆన్ ప్యాక్ కింద.. 28 రోజుల పాటు రెండు ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ లభిస్తుంది. అలాగే 7 రోజుల పాటు పనిచేసే 1జీబీ డేటా కూడా లభిస్తుంది. యాక్టివ్ సర్వీస్-వాలిడిటీ రీఛార్జ్ కలిగి ఉన్న అర్హత గల వీఐ (Vi) ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ ఈ ప్యాక్ అందుబాటులో ఉంటుంది.
కస్టమర్లు వీఐ (Vi) యాప్ లేదా థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా రూ.35 ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీఐ (Vi) నంబర్‌తో లాగిన్ అయి, తమకు నచ్చిన రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవడం ద్వారా వీఐ (Vi) మూవీస్ అండ్ టీవీ యాప్ ద్వారా ప్రయోజనాలను యాక్టివేట్ చేసుకోవచ్చు.







