గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Sanjay Jaju) గ్లోబల్ సమిట్ ( Global Summit) ఏర్పాట్లను పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ (Future City)లోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను పరిశీలించేందుకు పలువురు ఐఏఎస్(IAS), ఐపీఎస్ (IPS) అధికారులతో కలిసి వచ్చిన సంజయ్ జాజు సమిట్ ప్రాంగణంలో కలియతిరిగారు. నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు.







