హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు (Sanjay Jaju) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) స్థానంలో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీ (Hyderabad CP)గా పనిచేసిన వీసీ సజ్జనర్ (VC Sajjanar)ను ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయనకు ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సజ్జనర్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ (Mahesh Bhagwat) హైదరాబాద్ నూతన సీపీగా నియమితులయ్యారు.







