ఆకాశంలో ఒక తార.. సినిమా ప్రీమియర్ ఈవెంట్.. హాజరు కానున్న నటుడు దుల్కర్ సల్మాన్
మలయాళ, తెలుగు సినీ ప్రేమికులకు, ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ అభిమానులకు ఇది నిజంగా ఓ పండుగ లాంటి వార్త! అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఫ్రీమాంట్లో ‘ఆకాశంలో ఒక తార’ (AOT – Aakasamlo Oka Tara) చిత్రానికి సంబంధించిన ప్రత్యేక రెడ్ కార్పెట్ ప్రీమియర్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు కథానాయకుడు దుల్కర్ సల్మాన్ స్వయంగా హాజరై అభిమానులతో సందడి చేయనున్నారు.
నవంబర్ 19 వ తేదీన సినీ లాంజ్ ఫ్రీమాంట్, ఫ్రీమాంట్, కాలిఫోర్నియా (Cine Lounge Fremont, Fremont, CA) వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5:00 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, అభిమానులు అందరూ సాయంత్రం 4:30 కల్లా చేరుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో వైపు ఈ రెడ్ కార్పెట్ ప్రీమియర్ మరియు సెలబ్రిటీ ఇంటరాక్షన్ లాబీలోకి టికెట్లు ఉన్న అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మధ్యాహ్నం 3:00 గంటల నుంచి ఏ షోటైమ్కైనా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ల కోసం www.cinelounge.com వెబ్సైట్ను సంప్రదించవచ్చు. దుల్కర్ సల్మాన్ను ప్రత్యక్షంగా కలిసే ఈ అరుదైన అవకాశాన్ని అభిమానులు ఎవరూ మిస్ చేసుకోవద్దని నిర్వాహకులు పిలుపునిచ్చారు.







