ఎలాంటి పోరాటానికైనా సిద్ధం : మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కి ధారాదత్తం చేసింది బీఆర్ఎస్ అని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలను మంత్రి తిప్పికొట్టారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం 34 శాతం నీటికే అంగీకరించి తెలంగాణకు ద్రోహం చేసిన ఘనత కేసీఆర్ (KCR)కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి లాలూచీ పడకుండా వాటర్ గ్రిడ్‌ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కృష్ణా నీటిలో న్యాయమైన వాటా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.







