తెలంగాణలో మరోసారి సర్ గడువు పొడిగింపు
తెలంగాణలో సర్ గడువును ఎన్నికల సంఘం (Election Commission) మరోసారి పొడిగించింది. డిసెంబర్ 10తో ముగియాల్సిన గడువును అదే నెల 22 వరకు పొడిగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) తెలిపారు. ముసాయిదాలో పేరు లేని అర్హుల ఓటు నమోదు (Voter Registration) కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సర్ (Sir) గడువును పలుమార్లు పొడిగించారు.







