వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి నోటీసులు
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Y.S. Avinash Reddy) కి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పోలీసులు (Pulivendula Police) నోటీసులు ఇచ్చారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) నామినేషన్ల సందర్భంగా స్థానిక పోలీసులు ఆయనకు నోటీసులు (Notices) అందించారు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. వాట్సప్‌లోనూ ఆయనకు పంపారు.







