రానున్న 48 గంటలు అత్యంత కీలకం : హోంమంత్రి అనిత
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను 9 Akvan cyclone ) ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం, ముందస్తు చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anita)అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న 48 గంటలు అత్యంత కీలకం తెలిపారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర సహాయక చర్యల కోసం 13 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 11 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని హోంమంత్రి సూచించారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రజలకు సహాయం అందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆమె ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం లేదా సమాచారం కోసం విపత్తు నిర్వహణ హెల్ప్‌లైన్ నంబర్ 1070 లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004250101ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. అక్వాన్ తుపాను కదలికలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.







