ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో మూడో దశ పంచాయతీ ఎన్నికల 9Panchayat Elections)కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు (Nominations) స్వీకరించనున్నారు. 24న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 27 తుది గడువు. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ (Polling) జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.







