601 మండల్లాలో ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తి : ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 659 మండల పరిషత్‌లకు గాను 601 చోట్ల ఎంపీపీ (MPP), వైఎస్ ఎంపీపీ ( Vice MPP) ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) (ఎస్ఈసీ) తెలిపింది.58 మండల ప్రజా పరిషత్‌లలో పెండింగ్ ఉన్నట్లు పేర్కొంది. పెండింగ్ స్థానాల్లో శుక్రవారం (Friday) ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరుగుతాయని వివరించింది. మన్యం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయ్యాయని వివరించింది.







