సర్పంచ్ పదవికి ఏపీ మంత్రి సతీమణి నామినేషన్
నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ మంత్రి సతీమణి (Ministers wife) నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ((BC Janardhan Reddy)) సతీమణి ఇందిరారెడ్డి (Indira Reddy) రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. బనగానపల్లె పంచాయతీని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే తన లక్ష్యమని ఇందిరారెడ్డి తెలిపారు. ఆమెకు కూటమి నేతలు శుభాకాంక్షలు తెలిపారు. నామినేషన్ కార్యాక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు స్థానిక టీడీపీ ( TDP), జనసేన (Jana Sena), బీజేపీ (BJP) నేతలు పాల్గొన్నారు.







