సంతనూతలపాడు ఎంపీపీగా ఎన్నారై
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు (Santhanuthalapadu) మండల ఎంపీపీగా ఎన్నారై తారాబాబు విక్రమ్ (Tarababu Vikram) ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. ఈమె అమెరికా (America)లో ఐటీ కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్, హోటళ్లు తదితర వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తన తల్లితండ్రుల గ్రామమైన సంతనూతలపాడు మండలంలోని ఎనికపాడు నుంచి టీడీపీ (TDP) తరపునపోటీ చేసి ఎంపీటీసీగా విజయం సాధించారు. గురువారం మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ (MPP)గా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.







