ధురంధర్ తర్వాత మరోసారి రణ్వీర్తో ఆదిత్యధర్
బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్ ను అందుకున్న ధురంధర్(Dhurandar) సినిమాతో డైరెక్టర్ ఆదిత్యధర్(Adityadhar) పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఇందులో టైటిల్ క్యారెక్టర్ లో రణ్వీర్ సింగ్(Ranveer singh) తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకోగా, కథను తెరకెక్కించిన విధానంతో ఆదిత్యధర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సక్సెస్‌తో వీరిద్దరి కాంబినేషన్‌పై ఆడియన్స్ లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి
తాజా సమాచారం ప్రకారం, ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌ను మరోసారి తెరపైకి తీసుకురావాలని ఆదిత్యధర్ డిసైడ్ అయ్యారట. రణ్వీర్ సింగ్ హీరోగా ఓ కొత్త సినిమాను రూపొందించేందుకు ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ కొనసాగుతున్నాయి. కథ, జానర్‌తో పాటు ఇతర కీలక వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
అయితే ఈ సినిమా షూటింగ్ 2027 సెకండాఫ్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ నటిస్తున్న ప్రళయ్(Pralay) సినిమాను పూర్తి చేసిన తర్వాత ఆయన ఆదిత్యధర్ ప్రాజెక్టులో భాగం కానున్నారు. ఈ సినిమాను ఆదిత్యధర్ స్వయంగా నిర్మించనుండటం మరో విశేషం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.







