బాడీ షేమింగ్‌పై మృణాల్ ఠాకూర్ రియాక్షన్!
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) మరోసారి తన అభిప్రాయాలతో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా మహిళల శరీరాకృతి, అందంపై సమాజంలో ఉన్న అభిప్రాయాల గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గతంలో తన రూపంలోనూ, శరీరాకృతిలోనూ లోపాలు వెతుక్కున్నానని, అయితే ఇప్పుడు తన సహజమైన అందాన్ని ప్రేమించడం నేర్చుకున్నానని వెల్లడించింది. వంపులు తిరిగిన శరీరాకృతి కలిగి ఉండటంలో ఎలాంటి తప్పు లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
ఆరోగ్యంగా ఉండటంతో పాటు తమ శరీరాకృతిని గౌరవించడం ఎంతో ముఖ్యమని మృణాల్ అభిప్రాయపడింది. వివిధ ప్రాంతాలకు ప్రయాణించడం, భిన్న సంస్కృతులు, జాతులకు చెందిన వ్యక్తులను కలవడం వల్ల అందం అనేది ఒకే రూపంలో ఉండదనే విషయాన్ని తెలుసుకున్నానని మృణాల్ ఈ సందర్భంగా చెప్పింది. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, తమ సహజ రూపాన్ని అంగీకరించాలని సూచించింది. మార్పులు చేసుకోవాలనుకున్నా ముందుగా ఆత్మవిశ్వాసం, స్వీయ అంగీకారం ఉండాలని పేర్కొంది.
గతంలో తన పియర్ షేప్డ్ బాడీపై వచ్చిన విమర్శలకు కూడా మృణాల్ ధీటుగా రియాక్ట్ అయింది. తన శరీరాకృతిని దాచుకోకుండా, ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించడం ద్వారా అందానికి ఉన్న మూస ధోరణులను మార్చాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న రాకా(Raaka) సినిమాలో మృణాల్ కీలక పాత్రలో కనిపించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.







