డైరెక్టర్ రామ్.. లోన్ వుల్ఫ్ గా సరికొత్త అవతారం!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత కీలకమైన ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. నటుడిగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో భాగమైన ఆయన, ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. #RAPO23 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, దర్శకత్వ బాధ్యతలను రామ్ స్వయంగా చేపడుతున్నారు. కృష్ణ పోతినేని(Krishna pothineni) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి
ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్ అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తనదైన మార్గాన్ని ఎంచుకుని, ఎలాంటి పరిస్థితులనైనా ఒంటరిగా ఎదుర్కొనే వ్యక్తి చుట్టూ ఈ కథ సాగనుందని మేకర్స్ వెల్లడించారు. స్వతంత్ర భావాలు, ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ కలిగిన ఓ విభిన్నమైన పాత్రలో రామ్ కనిపించనున్నట్లు ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది.
నియో నాయర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు(Thiru) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సంయుక్త మీనన్(Samyuktha menon) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఆమె ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. డైరెక్టర్ గా రామ్ ఎలాంటి ముద్ర వేస్తారోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.







