విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
• మూడు రీజియన్లల్లో చేపట్టిన ప్రణాళికలు… అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల గ్రౌండింగ్ వంటి అంశాలపై అధికారుల ప్రజంటేషన్.
• ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం.
• రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకు పెద్దపీట.
• అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాల్లో అభివృద్ధికి కార్యాచరణ.
• మూడు ఆర్థిక ప్రాంతాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు.
• విశాఖ ఎకనమిక్ రీజియన్-VER పరిధిలో వివిధ శాఖల్లో 167 అభివృద్ధి పనులకు ప్రణాళికలు… ఇప్పటికే 64 పనులను ప్రారంభించిన ప్రభుత్వం.
• VERకు యాంకర్ ప్రాజెక్టుగా వైజాగ్ బే సిటీ.
• మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌ల అభివృద్ధి.
• విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడ ఇండస్ట్రియల్ సిటీ, పోర్టుల విస్తరణకు ప్రణాళికలు.
• విశాఖలో 15–20 కొత్త ఐటీ సంస్థలను ఆకర్షించడం.. ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా 2 లక్షల ఉద్యోగాల హామీని కార్యరూపంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రభుత్వం.
• తీర ప్రాంత అభివృద్ధి, కోనసీమ బ్యాక్ వాటర్స్ అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం.
• అరకు, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులపై ఫోకస్.
• అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, స్పేస్, ఎయిర్ క్రాఫ్ట్, ఆటో, ఈవీ, డిఫెన్స్, టూరిజం, నాలెడ్జ్ రంగాలకు కేంద్రంగా తిరుపతి ఎకనమిక్ రీజియన్-TER అభివృద్ధికి ప్రణాళికలు.
• ఏపీలోని 87 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో TER పరిధిలో 66 ప్రాజెక్టుల పెట్టుబడులు.
• హార్టికల్చర్ హబ్‌లో భాగంగా డెయిరీ ప్రాసెసింగ్, మీట్ అండ్ పౌల్ట్రీ, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, టెర్మినల్ మార్కెట్లు వంటి క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేసిన అధికారులు.
• తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 14 పట్టణాలను వివిధ రంగాల వారీగా పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దేలా ప్రతిపాదనలు.
• అమరావతి ఆర్థిక ప్రాంతంలో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండింగ్ చేసేలా ప్రణాళికలు.
• మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణం పూర్తి చేసి ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధి, లాజిస్టిక్స్ రంగానికి ఊతమిచ్చేలా చర్యలు.
• కోస్టల్ టూరిజంలో భాగంగా సూర్యలంక, ఓడరేవు, రామాపురం, చినగంజాం, నిజాంపట్నం, దిండి ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక.







