టైసన్ నాయుడు టీజర్.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా బెల్లంకొండ!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(bellamkonda sai sreenivas) మరోసారి తనదైన యాక్షన్ అవతార్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా సినిమా టైసన్ నాయుడు(Tyson naidu) టీజర్ తాజాగా రిలీజైంది. అప్పట్లో ఒకడుండేవాడు(Appatlo okadundevadu), భీమ్లా నాయక్(bheemla nayak) సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కె. చంద్ర(Sagar K chandra) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్(14 treels plus) బ్యానర్‌పై రామ్ ఆచంట(Ram achanta), గోపీ ఆచంట(Gopi achanta) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో సాయి శ్రీనివాస్ కఠినమైన నిర్ణయాలు తీసుకునే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
టీజర్లో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) అనే స్పెషల్ పోలీస్ విభాగాన్ని పరిచయం చేశారు. సాధారణ పోలీసింగ్‌కు భిన్నంగా నేరస్థులకు తక్షణమే శిక్ష విధించే విధానంతో ఈ టీమ్ పనిచేస్తున్నట్లు చూపించారు. ఈ క్రమంలో వరుసగా చోటుచేసుకునే నేరాలు, వాటి వెనుక దాగున్న భారీ కుట్ర కథలో ఉత్కంఠను పెంచుతున్నాయి. యాక్షన్‌తో పాటు సస్పెన్స్‌కు ప్రాధాన్యతనిస్తూ డైరెక్టర్ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ టీజర్‌కు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. నేహా శెట్టి(neha shetty) హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal) స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. నరేష్(naresh), సునీల్(Suneel), రావు రమేష్(Rao ramesh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముకేష్ జ్ఞానేశ్(mukesh gnanesh) సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో(bheems ciciroleo) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మరింత బలాన్నిచ్చాయి. మొత్తంగా టైసన్ నాయుడుతో బెల్లంకొండ మరోసారి మాస్ యాక్షన్‌తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు.







