గోపీచంద్ కోలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించనున్న ఓ సినిమాలో టాలీవుడ్ హీరో గోపీచంద్(Gopichand) విలన్ గా కనిపించబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తతో గోపీచంద్ కోలీవుడ్ లోకి విలన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని గోపీచంద్ టీమ్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి రూమర్లను ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలను కోరింది.
ఇవి కూడా చదవండి
గోపీచంద్ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సంకల్ప్ రెడ్డి(Sankalp Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా భారతవర్ష: సాగా ఆఫ్ శూల(barathavarsha: saga of soola)లో ఆయన నటిస్తున్నారు. ఇందులో రీతూ వర్మ(Ritu varma) హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీనివాస్ చిట్టూరి(Sreenivas chitturi) నిర్మిస్తున్నారు. వీటితో పాటు వి. వెంకట్(V Venkat) దర్శకత్వంలో రూపొందుతున్న సింగ(Singa) అనే యాక్షన్ ఎంటర్టైనర్కు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇదే కాకుండా బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ గోపీచంద్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్లో జరుగుతోంది. తన నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ వివరాలను గోపీచంద్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే వెల్లడిస్తామని ఆయన టీమ్ క్లారిటీ ఇవ్వడంతో సూర్య సినిమా వార్తలకు తెరపడింది.







