జెన్సన్ కు ట్రంప్ మద్దతు వెనక ఇన్వెస్ట్ మెంట్స్ రీజన్..?
ఎన్విడియా (Nvidia).. మాజీ సీఈవో జెన్సన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుగా నిలబడ్డారు.అతనిపై వచ్చిన ఆరోపణలను సైతం కొట్టిపారేశారు. ఓ గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొన్న యువతితో సన్నిహిత సంబంధం నెరపిన వ్యక్తికి ట్రంప్ ఎందుకంత అండగా నిలబడ్డారు. ఇప్పుడిదే అంశం చర్చనీయాంశమైంది కూడా. అయితే దీనివెనక ట్రంప్ ఎన్విడియాలో పెట్టిన పెట్టుబడులు కారణమా అన్న కోణంలో చర్చ జరుగుతోంది.
వాషింగ్టన్ పోస్టు కథనం ప్రకారం గత రెండేళ్లలో ట్రంప్ పెట్టుబడులు ఈ సంస్థలో భారీగా పెరిగాయి. 2024 సంవత్సరాంతానికి ఈ సంస్థలో ట్రంప్‌నకు 6,15,000 నుంచి 13 లక్షల డాలర్ల వరకు విలువైన షేర్లు ఉండేవి. ఇప్పుడు ఆయన వాటాల విలువ 13 మిలియన్ డాలర్ల నుంచి 62 మిలియన్ డాలర్ల మధ్యలో ఉంటుందని అంచనా.
ఇవి కూడా చదవండి
చైనాకు చిప్స్ సరఫరా.. తన (US President Donald Trump) కార్యవర్గంతో ఎన్విడియాకు ఉన్న సంబంధాలపై విమర్శలు చెలరేగుతున్న వేళ.. ఈ పెట్టుబడుల విషయాన్ని ట్రంప్ బహిర్గతం చేశారు. ఎన్విడియా వివాదానికి సంస్థ మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధాలు కేంద్ర బిందువుగా ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు ట్రంప్ కార్యవర్గం ఎన్విడియా సహా మరో రెండు డజన్ల కంప్యూటర్ చిప్స్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలను నేషనల్ ఛాంపియన్స్‌గా ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది.







