కలర్‌ఫుల్ లుక్‌లో చూపు తిప్పుకోనివ్వని రకుల్
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(Venkatadri express) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh), తక్కువ టైమ్ లోనే పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైన రకుల్, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగానే అమ్మడు తన స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ కనిపిస్తుంది. తాజాగా కలర్‌ఫుల్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తూ తనదైన గ్లామర్‌తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చక్కని చిరునవ్వు, మెరిసే కళ్లతో కెమెరాకు పోజులిస్తూ ఫోటోషూట్‌లో సందడి చేసింది. ఈ ఫోటోల్లో వేవీ హెయిర్ స్టైల్, అందమైన గోల్డ్ జ్యువెలరీ, సింపుల్ మేకప్‌తో రకుల్ తన లుక్‌ను మరింత స్పెషల్ గా మార్చుకుంది. ముఖ్యంగా తన చిలిపి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోలకు ఎక్స్ట్రా బ్యూటీని తీసుకొచ్చింది. రకుల్ షేర్ చేసిన ఈ ట్రెండీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట అందరినీ అలరిస్తున్నాయి.







