బాలయ్య-కొరటాల సినిమాలో విద్యాబాలన్‌కు కీలక పాత్ర!
సౌత్ సినీ ఇండస్ట్రీలో మరోసారి విద్యాబాలన్(Vidya Balan) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రజనీకాంత్(Rajinikanth) నటించిన జైలర్2(Jailer2)లో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె యాక్టింగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సౌత్‌లో అవకాశాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishan), డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టెంపరరీగా NBK112గా పిలుస్తున్న ఈ సినిమాలో విద్యాబాలన్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
ఈ సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ గా పరిగణనలోకి వచ్చినప్పటికీ, రన్ టైమ్ మాత్రం లిమిటెడ్గానే ఉంటుందని టాక్. కథను మలుపు తిప్పే ప్రాధాన్యత కలిగిన క్యారెక్టర్ కావడంతో పాటు, మరో హీరోయిన్‌కు కూడా సినిమాలో చోటు ఉండనున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్(NTR Bipoic)లో విద్యాబాలన్ బసవతారకం పాత్రను పోషించారు. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఇప్పటికే అఫీషియల్ గా స్టార్ట్ అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri), సుధాకర్ మిక్కిలినేని(Sudhakar mikkilineni) సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా హై ఓల్టేజ్ పొలిటికల్ డ్రామాగా రూపొందనుందని సమాచారం. భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.







