వృషకర్మ కోసం చైతూ భారీ ప్రమోషనల్ ప్లాన్!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga chaiatnya) తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వృషకర్మ(Vrushakarma) సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు(Karthik varma dandu) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ తో పాటు ప్రమోషన్ల విషయంలోనూ చైతన్య ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ కు సంబంధించిన ఇంటర్వ్యూలను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. రాబోయే నెల రోజుల పాటు ఇతర కమిట్మెంట్లకు దూరంగా ఉంటూ పూర్తిగా వృషకర్మ ప్రమోషన్లకే టైమ్ కేటాయించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేందుకు ట్రైలర్, సాంగ్స్ ను కీలకంగా ఉపయోగించుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటివరకు రిలీజైన ప్రచార కార్యక్రమాల కంటే రాబోయే ప్రమోషన్లతో మరింతగా హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. సినిమా అవుట్‌పుట్‌పై నిర్మాతలు, డైరెక్టర్ ఎంతో నమ్మకంతో ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె కూడా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అజనీష్ లోక్‌నాథ్(Ajaneesh lokanath) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్స్ కొనసాగుతుండగా, ఈ నెలాఖరులోగా సినిమా ఫైనల్ కాపీ రెడీ కానుందని సమాచారం. డిసెంబర్ రిలీజ్ విషయంలో ఇతర సినిమాల కంటే ముందుగానే ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన నాగచైతన్య, ఈ ప్లానింగ్ తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.







