కాలిఫోర్నియాలోని శివదుర్గ దేవాలయంలో మరోసారి చోరీ..
శాంటాక్లారా, కాలిఫోర్నియాలో వున్న శివదుర్గ ఆలయంలో మరోసారి దొంగతనం జరిగింది. నవంబర్ 15 న దొంగతనం జరిగింది. దీంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఆలయంలో గతంలో కూడా దొంగతనాలు జరిగాయి; ముఖ్యంగా 2024 జనవరి మరియు 2025 ఆగస్టు నెలల్లో పెద్ద ఎత్తున దొంగతన ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇక.. దేవాలయంలో దొంగతనం జరిగిందని రిపబ్లికన్ నేత రితేశ్ టాండన్ తెలిపారు. హిందూ దేవాలయాలలో పదేపదే జరుగుతున్న ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు విషయంలోనూ, ఆ ప్రార్థనా స్థలంలో భద్రతను మెరుగుపరిచే చర్యల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఇదే విషయంపై అదే నియోజకవర్గానికి చెందని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నాను కూడా టాండన్ సంప్రదించారు. ఆయనతో కూడా చర్చించారు.
ఇక.. దేవాలయ కమిటీ కూడా పదే పదే జరుగుతున్న దొంగతనాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము పోలీసు విచారణకు సహకరిస్తున్నామని, మరిన్ని వివరాలు తెలిసిన వెంటనే తదుపరి సమాచారాన్ని అందజేస్తామని దేవాలయ కమిటీ పేర్కొంది.







