భీమవరంలో పొత్తు లేకుండానే .. అన్ని వార్డులో పోటీ : శ్రీనివాసవర్మ
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాబు వ్యవహారం పై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathiraju Srinivasavarma) అసహనం వ్యక్తం చేశారు. . భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ పోత్తుతో సంబంధం లేకుండా అన్ని వార్డులో పోటీ చేస్తామన్నారు. బీజేపీ ( BJP)కి ఏ వార్డులు కేటాయించారో సమాచారం ఇవ్వకుండానే టీడీపీ ( TDP), జనసేన నాయకులు అభ్యర్థుల జాబితాలు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో 52 వార్డులు ఉండగా తమకు ఐదు సీట్లు ఇస్తామని నిర్ణయించడం, ఎంపీ పాకా సత్యనారాయణ (Paka Satyanarayana) తనయుడికి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్వవహరించడం బీజేపీని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. తమకు కేటాయించిన ఐదు వార్డుల్లో రెండు చోట్ల అభ్యర్థులు ఖరారు కాగా, మిగిలిన మూడు స్థానాలపై బీజేపీ నిర్ణయం తీసుకోకుండానే టీడీపీ, జనసేనలు చెరో 24 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు.







