బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy) కి తెలంగాణ హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. వీణవంకలో నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కరీంనగర్ సీపీ (Karimnagar CP)ని దూషించారనే ఫిర్యాదుతో వీణవంక పీఎస్ (Veenavanka PS) లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో వాయిస్ శాంపిల్ ఇవ్వాలని ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వాయిస్ శాంపిల్స్ సేకరిస్తారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు తెలిపారు. ఇరువైపులా వాదనల అనంతరం కౌశిక్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.







