న్యూయార్క్ లోని ప్రముఖ తెలుగు సంస్థల ఆధ్వర్యంలో భక్తి, సంగీత సమ్మేళనంగా “హర హర మహాదేవ”
ఎస్పీబీ మ్యూజిక్ అకాడమీ (SPBMA), న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ల సమిష్టి ఆధ్వర్యం లో, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA), తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) ల సహకారంతో నవంబర్ 14న హిక్స్విల్లోని ఆసామయి హిందూ టెంపుల్ అండ్ సాయి దర్బార్‌లో నిర్వహించిన “హర హర మహాదేవ — శివ తత్వాలు”కార్యక్రమం భక్తి, సంగీత సమ్మేళనంగా సాగింది. శ్రీ స్వర వీణాపాణి తమ భక్తిగీతాలు, తాత్విక వ్యాఖ్యానాలతో శ్రోతలను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తారు.
మిధునం సంగీత దర్శకులు, శ్రీ స్వర వీణాపాణి,శివుని మహిమను, తత్వాన్ని ఆవిష్కరించే భావపూర్ణ గీతాలతో సభలో భక్తి పరిమళాలను నింపారు. 72 మేళకర్త రాగాలతో రూపొందించిన కీర్తనల ప్రదర్శనప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 62 గంటల నిరంతర సంగీత ప్రదర్శనతో గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన ఆయన, రాగాల విశిష్టతను, గీతాల అంతరార్థాన్ని శ్రోతలకు వివరించారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గాయకుడుశ్రీ వై. ఎస్. రామకృష్ణభక్తిగీతాలను హృద్యంగా ఆలపించారు. SPBMA గాయకులు, కుమార్ బుధరాజు, వేణు పాల్యం, శ్రీనివాస్ గూడూరు, రాజేశ్వరి బుర్రా అందించిన పాటలను కూడా ప్రేక్షకులు ఆస్వాదించారు.
ఇవి కూడా చదవండి
యువ ప్రతిభకు ప్రోత్సాహం, సత్కారం
న్యూయార్క్‌లో పెరిగి, కళారంగంలో రాణిస్తున్న యువ ప్రతిభావంతులను ఈ సందర్భంగా ఎస్పీబీ మ్యూజిక్ అకాడమీ సహ సంఘాల అధ్యక్షుల చేతుల మీదుగా సత్కరించింది.
చిన్ననాటి నుంచే న్యూయార్క్ తెలుగు సంస్థల వేదికలపై పాటలు, వాయిద్యాలు, నాటకాలలో ప్రతిభ కనబరిచినఈశ్వర్ దొమ్మరాజు, ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించి మరిన్ని చిత్రాలకు అవకాశాలు అందుకున్నారు. ఆయన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం మాజీ అధ్యక్షుడుఉదయ్ దొమ్మరాజు, హేమ దొమ్మరాజు దంపతుల తనయుడు.
నటనపై మక్కువ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో సినీరంగంలో అడుగులు వేస్తున్నఅమిత్ అనుగు, అనతి కాలం లోనే పలు పాటల ఆల్బమ్‌లు, లఘుచిత్రాల్లో నటించి నిర్మాత దిల్ రాజు ప్రశంసలు అందుకున్నారు. ఆయనTTA వైస్ ఛైర్మన్ లక్ష్మణ్ అనుగు, TTA మాజీ అధ్యక్షురాలు వాణి అనుగు దంపతుల తనయుడు.
ఉదయ్–హేమ దొమ్మరాజు దంపతుల కుమార్తెదివ్య దొమ్మరాజు, సాంస్కృతిక, సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ, రెండవ తరం నుండి ఎదిగిన మొట్టమొదటి యువ నాయకురాలు. ప్రస్తుతం TLCAసంయుక్త కార్యదర్శిగాసేవలందిస్తున్న ఆమె కృషిని కూడా అభినందించారు.
సహకరించిన సంస్థల నాయకత్వానికి కృతజ్ఞతలు
కార్యక్రమ భాగస్వాములు NYTTA ప్రెసిడెంట్ శ్రీ డా. రవీందర్ కోడెల గారిని, SPBMA ప్రెసిడెంట్ శ్రీనివాస్ గూడూరు గారిని అబినందిస్తూ సత్కరించారు.
ఈ కార్యక్రమానికి సహకారం అందించిన సంఘాల నాయకులు,TLCA ట్రస్టీ శ్రీ మోహన్ బాధే, ప్రెసిడెంట్ సుమంత్ రామిశెట్టి, TTA ప్రెసిడెంట్-ఎలెక్ట్ సహోదర్ పెద్దిరెడ్డి లను సత్కరించారు.
భక్తిగీతాలు, తాత్విక వ్యాఖ్యానాలతో శ్రోతలను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తిన .శ్రీ వీణాపాణి గారిని అన్నీ సంస్థల ప్రతినిధుల చేతులమీదుగా శాలువా, జ్ఞాపికలతో గౌరవించారు!
అనంతరం TANA రీజనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ బర్తవరపు గారిని, బాస్టన్ నుండి విచ్చేసిన ప్రముఖు గాయకులు శ్రీ YSరామకృష్ణ గారిని కూడా ఆత్మీయంగా సత్కరించారు.
అన్నీ సంస్థల శ్రేయోభిలాషి, మహా దాత Dr.పైళ్ళ మల్లా రెడ్డి గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేసారు.
SPBMAఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కుమార్ బుధరాజు, వేణు పాల్యం గారు వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు.
తెరవెనుక ఏర్పాట్లలో కృషిచేసిన సునీల్ రెడ్డి, మహేష్, విజయేందర్, వాణి/చందు సింగిరికొండ, వాణి అనుగు, పద్మ కొడెల, రమ వనమలకు ఎస్పీబీ మ్యూజిక్ అకాడమీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, సంగీతాభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
NYTTA ఛైర్మన్ డా. రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ ఛైర్మన్ లక్ష్మణరెడ్డి అనుగు, అడ్వైజర్ చినబాబు రెడ్డి, SPBMA సంస్థ ఛైర్మన్ హరి ఎప్పనపల్లి, సంఘ బోర్డు సభ్యులు సుజాత వెంపరాల, లావణ్య మడకశిర, రాజేశ్వరి బుర్ర, TLCAకార్యవర్గ సభ్యులు శిరీష తునుగుంట్ల అభినందనలు తెలిపారు.
కార్యక్రమ నిర్వాహకులు శ్రీ శ్రేణివాస్ గూడూరు మాట్లాడుతూ ఈ కార్యక్రమ అన్నీ సంస్థల నాయకుల, కార్యకర్తల సమిష్టి కృషి ఫలితంఅన్నారు. న్యూయార్క్ లోని వివిధ తెలుగు సంస్థల నాయకుల భాగస్వామ్యం పరస్పర సహకారానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు.
దాతలకు, సభికులకు కృతజ్ఞతలు
ఉదారంగా సహకరించిన దాతలకు అకాడమీ కృతజ్ఞతలు తెలిపింది. అందరి ఆశీర్వాదాలతో బాలు గారి ప్రేరణ తో వెలసిన SPBMA మరిన్ని మంచి మంచి కార్యక్రమాలని అందిస్తుందని తెలియజేశారు, ఉత్సాహంగా పాల్గొన్న సంగీతాభిమానులు, కుటుంబాలు, స్వచ్ఛంద సేవకులు, తెలుగు సమాజ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.
రుచికరమైన భోజనం, ఆత్మీయ ఆతిథ్యంతో సాగిన ఈ వేడుక భక్తి, సంగీతం, స్నేహసౌహార్దాలతో సభికులకు మధురానుభూతిని మిగిల్చింది.







