కాలేజ్ విల్లేలో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలు విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా 2026 నవంబర్ 15వ తేదీన పెన్సిల్వేనియా రాష్ట్రంలోని కాలేజ్విల్లే లో తానా ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలతో పాటు ఈషా ఫౌండేషన్ యోగా, ధ్యానకార్యక్రమాన్ని నిర్వహించారు. యోగ నమస్కార్, నాడీ శుద్ధి, మిరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ వంటి యోగ, ధ్యాన ప్రక్రియలపై వచ్చినవారికి శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అమూల్యమైన సహకారం అందించిన ఈషా ఫౌండేషన్‌కు, ముఖ్యంగా శ్రీదేవి, గజేంద్ర బాబుగారికి, తరగతులను అత్యంత నైపుణ్యంతో, అంకితభావంతో, స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన శిక్షకులు ఆరోన్ ఆడమ్స్ మరియు చిరంజీవి కంచర్ల గార్లకు తానా టీమ్ హృదయపూర్వక అభినందనలను తెలియజేసింది. వారి అనుభవం, మార్గదర్శకత్వం మరియు జ్ఞానం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడ్డాయని, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన వేదికను ఉదారంగా అందించి సహకరించిన ఉదయ్ సుంకరకు, వలంటీర్లకు, ఇతరులకు తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, విజయవంతంగా నిర్వహించడంపై తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేయడంతోపాటు అందరికీ అభినందనలు తెలిపారు.
తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ రీజినల్ రిప్రజెంటేటీవ్ ఫణి కంతేటి, సతీష్ తుమ్మల, సురేష్ యలమంచి, రంజిత్ మామిడి, కృష్ణ నందమూరి తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేశారు.
కమ్యూనిటీ అభివృద్ధికి తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లవేళగా అండగా ఉంటున్న తానా అగ్ర నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి రుచికరమైన భోజనాలను అందించినవారికి, ఇతరులకు తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది.








