పెళ్లి తర్వాత అనిరుధ్ లాంగ్ బ్రేక్
సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్న అనిరుధ్ రవిచందర్ (Anirudh ravichander) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో తీరికలేకుండా గడిపిన ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కొంతకాలం పాటు వర్క్ నుంచి గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నారట. వచ్చే ఏడాది జనవరి వరకు కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని సినిమా అవకాశాలను కూడా పక్కన పెట్టినట్లు సమాచారం.
ఇటీవల నవంబర్ 11న గ్రీస్‌లో కావ్య మారన్(Kavya Maran)ను అనిరుధ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక తర్వాత నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత పూర్తిగా పర్సనల్ లైఫ్ కు టైమ్ కేటాయించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతకాలం రికార్డింగ్‌లు, కంపోజింగ్లకు దూరంగా ఉండనున్నారు.
ఇక అనిరుధ్ చేతిలో ప్రస్తుతం పలు భారీ సినిమాలున్నాయి. రజనీకాంత్ జైలర్2(Jailer2)కు మ్యూజిక్ వర్క్స్ పూర్తి చేసి ఆ సినిమాను రిలీజ్ చేసిన ఆయన, కమల్ హాసన్(Kamal Haasan) సాండియార్(Sandiyar), ధర్మన్(Dharman), ఇండియన్3(Indian3), శింబు(Simbhu) అరసన్(Arasan) సినిమాలకు వర్క్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా సాండియార్ టీజర్ కోసం ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలకంగా మారింది. అనుకున్న టైమ్‌కి మ్యూజిక్ వర్క్స్ పూర్తికాకపోవడంతో టీజర్ వాయిదా పడినట్లు సమాచారం. జనవరి 2027లో తిరిగి పనులు ప్రారంభించి వరుస ప్రాజెక్టులతో బిజీ కానున్నట్లు తెలుస్తోంది.







