డల్లాస్ రాధాకృష్ణ టెంపుల్ లో ‘‘తులసీ వివాహం’’ వేడుకలు
డల్లాస్లోని ప్రసిద్ధ రాధా కృష్ణ టెంపుల్ (Radha Krishna Temple of Dallas) ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవానుడు మరియు తులసి దేవి దివ్య కల్యాణ మహోత్సవం (Tulsi Vivah – Divine Wedding) అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.నవంబర్ 21 వ తేదీన సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
ఈ వేడుక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాల జాబితా ఇదే..
గణేష్ పూజ (Ganesh Pooja)
గ్రహ శాంతి (Grah Shanti)
బరాత్ (Baraat)
దండల మార్పిడి / వర్మాలా (Garland Exchange / Varmaala)
కన్యాదానం & ఫేరే (Kanyadaan & Phere)
వీడై (Vidaai)
భక్తులందరూ ఈ దివ్య వివాహ మహోత్సవంలో పాల్గొని శ్రీకృష్ణ, తులసి దేవి కృపకు పాత్రులు కావాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
తులసి వివాహం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇది తులసీదేవికి (బృందావతికి) శ్రీ మహావిష్ణువు (శాలిగ్రామ రూపం)కి మధ్య జరిగే దివ్య వివాహ మహోత్సవాన్ని సూచిస్తుంది.కార్తీక మాసంలో శుక్ల పక్ష ద్వాదశి తిథి రోజున తులసి వివాహం నిర్వహిస్తారు (కొన్ని ప్రాంతాల్లో ఏకాదశి నుండి కార్తీక పౌర్ణమి వరకు కూడా చేస్తారు.







