దిల్ రాజుకు షాకిచ్చిన ఎన్టీఆర్- అనిల్ రావిపూడి ప్రాజెక్ట్
టాలీవుడ్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్(Nandamuri kalyanram) నిర్మించనున్నారు. అయితే ఈ అనౌన్స్మెంట్ లో ఎక్కడా నిర్మాత దిల్ రాజు(Dil Raju) పేరు కనిపించకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఒక్కరోజు గ్యాప్ లో చోటుచేసుకున్న ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన దిల్ రాజు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని వెల్లడించారు. హీరో ఎవరనేది అప్పటికి ఫిక్స్ కాలేదని, సంక్రాంతి 2028 కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇంతలోనే ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్మెంట్ రావడంతో దిల్ రాజు ప్రాజెక్ట్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ ఇద్దరి మధ్య ముందుగానే డిస్కషన్స్ జరిగి ప్రాజెక్ట్ ఖరారై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా కార్యరూపం దాల్చడంలో కల్యాణ్ రామ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడికి సన్నిహితుడైన సాహు గారపాటి(Sahu garapati) కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి కాలేదు. ఇప్పటివరకు అనిల్ రావిపూడితో ఆరు సినిమాలు నిర్మించిన దిల్ రాజు.. ఆయనతో మరో సినిమా చేయాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్- అనిల్ ప్రాజెక్టు టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కు తెరలేపింది.







