విశ్వ గురుకులం విద్యార్థుల ఉత్సవ వేడుకలు.. రామాయణ ప్రతిభా ప్రదర్శన
తానా విశ్వ గురుకులం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రామాయణం అభ్యసిస్తున్న విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తానా సంస్థ చైర్మన్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గారు, అధ్యక్షులు కొడాలి నరేన్ గారు విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. రామాయణ విద్యను బోధిస్తున్న గురువుల సేవలను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఠాగూర్ మల్లినేని గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విశ్వ గురుకులం నిర్వాహకులు రామ్ మారం గారు విద్యార్థుల ప్రతిభను, ఉపాధ్యాయుల అంకితభావాన్ని, తల్లిదండ్రుల సహకారాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి
రామాయణం పుస్తక రచనలో సహకారం అందించిన మామిళ్ల లోకనాథం గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలువైన సూచనలు అందిస్తూ ఉపాధ్యాయుల కృషిని, విద్యార్థుల పురోగతిని, నిర్వాహకుల సేవలను అభినందించారు.
అలాగే పాఠశాల కార్యదర్శి శ్వేత వెలగలేటి గారు, పద్మిని గారు, సిద్ధార్థ్ పుట్రేవు గారు విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి, వారి ప్రతిభను ప్రశంసిస్తూ మరింత ప్రోత్సహించారు.
విశ్వ గురుకులంలో రామాయణ తరగతులను వంశీ శ్రీవాత్సవ భద్రి రాజు, రేవతి పుట్రేవు, సుష్మిత మక్కపాటి, శ్రీరేఖ పంచవటి, భాగ్యలక్ష్మి గుమ్మడి, వంశీ బొల్ల, అనూష నిమ్మగడ్డ, సుష్మ కొల్లూరి తదితర ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.
అమెరికాలో నివసిస్తున్నప్పటికీ తమ పిల్లలకు వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా నేర్పిస్తున్న విశ్వ గురుకులం సేవల పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గురువులకు, నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను భావితరాలకు అందించడంలో తానా విశ్వ గురుకులం చేస్తున్న కృషి చేస్తుంది. రామాయణంలోని ఆదర్శాలను విద్యార్థుల జీవితాల్లో భాగం చేస్తూ, సంస్కృతి పరిరక్షణకు సేవలు అందిస్తుంది.








