ఫ్యాన్స్ కోసం అనిల్ రావిపూడితో తారక్ స్పెషల్ ప్లాన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) తన నెక్ట్స్ సినిమాల విషయంలో ఇంట్రెస్టింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon) సినిమా మొదట 2026 జూన్‌లో రిలీజ్ కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం, గాయాలు, రీషూట్స్ కారణంగా 2027 జూన్‌కు వాయిదా పడింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారనే వార్త ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్గా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని సమాచారం.
వేగంగా సినిమాలను పూర్తి చేయడంలో అనిల్ రావిపూడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. లిమిటెడ్ బడ్జెట్లో, అనుకున్న టైమ్ లోనే సినిమాలను తెరకెక్కిస్తూ వరుస సక్సెస్‌లు అందుకుంటున్నారు. అలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేయడం ఫ్యాన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించడమే కాకుండా, డ్రాగన్ ఆలస్యం కారణంగా ఏర్పడిన నిరీక్షణకు తెరదించే అవకాశం ఉంది. ఆరు నెలల్లోపే షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచన ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2028 సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ సినిమా మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్(God Of War) ప్రాజెక్ట్ కూడా ఎన్టీఆర్ లైనప్‌లో ఉంది. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌పై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశముంది. వరుస ప్రాజెక్టులతో ఎన్టీఆర్ తన అభిమానులను ఉత్సాహపరిచే ప్రణాళికలో ఉన్నారు.







