పాటలతోనే అంచనాలు పెంచుతున్న రియాలిటీ!
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటిస్తూ రచన, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టిన సినిమా రియాలిటీ(Reality). ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచే ఆడియన్స్ లో మంచి ఆసక్తిని పెంచుతోంది. కథను పరిచయం చేసే విధానం, విజువల్స్‌తో పాటు మ్యూజిక్ కు ఇస్తున్న ఇంపార్టెన్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా ఉండే అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సాంగ్స్ స్పష్టం చేస్తున్నాయి.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) ఈ సినిమా కోసం అందించిన భజ గోవిందం(Bhaja govindam), రుత్తూ(Ruthu) సాంగ్స్ ఇప్పటికే ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రెండు సాంగ్స్ భిన్నమైన ఎమోషన్స్ ను పలికించినప్పటికీ, వాటిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీల లైఫ్ స్టైల్ అందరికీ కనెక్ట్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్స్ కు సంబంధించిన రీల్స్ విపరీతంగా వైరల్ అవుతుండగా, పలువురు వాటిని తమ వాట్సాప్ స్టేటస్‌లుగా కూడా పెట్టుకుంటున్నారు. దీంతో సినిమా మ్యూజిక్కు మంచి ప్రచారం లభిస్తోంది.
సుధాకర్ చాగంటి(Sudhakar chaganti) నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవిక భట్(Devika Bhatt) హీరోయిన్ గా నటిస్తోంది. కిరణ్ అబ్బవరం స్వయంగా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటూ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.







