ఫ్రిస్కోలో నూతన జైన దేవాలయ శంకు స్థాపన కార్యక్రమానికి IANT కి ఆహ్వానం
టెక్సాస్ లోని ఫ్రిస్కోలో నూతన జైన దేవాలయ శంకు స్థాపన కార్యక్రమానికి ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) కి ఆహ్వానం లభించింది. ఉత్తర టెక్సాస్ జైన సమాజం ఈ మేరకు వారిని ఆహ్వానించింది. ఇది తమ సంఘానికి లభించిన అరుదైన అదృష్టమని తాము భావిస్తున్నామని ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ప్రకటించింది.
ఈ అద్భుతమైన మైలురాయి, జైన సమాజం యొక్క సంవత్సరాల అంకితభావం, విశ్వాసం, ఐక్యత మరియు సామూహిక కలలకు ప్రతీక అని IANT పేర్కొంది. ఇది నిజంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే అద్భుత క్షణం, మరియు రాబోయే తరాలకు శాశ్వత వారసత్వాన్ని మిగిల్చే ఈ చారిత్రాత్మక సందర్భంలో భాగమైనందుకు IANT గర్విస్తోందని తెలిపింది.

ఈ సందర్భంగా JSNT నాయకత్వం, వాలంటీర్లు, మద్దతుదారులు మరియు కమ్యూనిటీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఈ నూతన ఆలయం రాబోయే తరాలకు శాంతి, ఆధ్యాత్మికత, ఐక్యత మరియు సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలవాలని, ఇరువురమూ కలిసి బలమైన సమాజాలను నిర్మిస్తామని ప్రకటించింది.







