జై షాకు అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్గా జై షా (Jai Shah) రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. జై షా సంపాదించుకున్న నమ్మకానికి ఏకగ్రీవ నిర్ణయమే నిదర్శనమన్నారు. ఆయన పునర్నియామకం భారత్ (India)కు గర్వకారణమని కొనియాడారు. క్రికెట్ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఇండోనేసియాలోని బాలి వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశం (ICC Board Meeting) లో డైరెక్టర్లు జై షా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.







